Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 26 2021 @ 20:44PM

మున్సిపాలిటీకి రాష్ట్రానికి తేడా ఉంది: కేజ్రీవాల్‌పై పంజాబ్ మంత్రి సెటైర్లు

చండీగఢ్: తాము అధికారంలోకి వస్తే ఢిల్లీ తరహాలో పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలలను మారుస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇస్తున్న హామీపై కాంగ్రెస్ నేత, పంజాబ్ విద్యాశాఖ మంత్రి ప్రగట్ సింగ్ సెటైర్లు విసిరారు. అరవింద్ కేజ్రివాల్ ఒక మున్సిపాలిటీకి ముఖ్యమంత్రి అని, పంజాబ్ రాష్ట్రమని.. ఈ రెండింటింకి తేడా తెలియకుండా హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో 2,600 పాఠశాలలు ఉంటే పంజాబ్‌లో 19,000 పాఠశాలలు ఉన్నాయని.. రెండింటినీ ఒకే విధంగా ఆలోచించుకోవడం అవివేకమని ప్రగట్ సింగ్ అన్నారు.


వచ్చే ఏడాది మార్చిలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌లో కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలు ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీలు తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం పంజాబ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా కొత్త పార్టీతో ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

Advertisement
Advertisement