ఛండీఘడ్ : పంజాబ్‌లో కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామాతో రాజకీయం వేడెక్కింది. అయితే, కాంగ్రెస్ అధిష్టానం ఎవరూ ఊహించని విధంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేరు తెర మీదకు తీసుకొచ్చింది. ఆయనే పంజాబ్ నెక్ట్స్ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని తేల్చేశారు. కాకపోతే, చరణ్‌జిత్ వివాదాలకు కొత్తేం కాదు. గతంలో ఆయన మీద ఏకంగా ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ ‘మీటూ‘ ఆరోపణలు చేశారు. అప్పట్లో పెద్ద దుమారమే రేగింది చన్నీ చుట్టూ.
2018లో తనకు చరణ్‌జీత్ అసభ్య మెసేజ్‌లు పంపాడంటూ ఒక లేడీ ఆఫీసర్ ఆరోపించారు. విషయం ఆనాటి సీఎం అమరీందర్ దాకా వెళ్లింది. కెప్టెన్ గట్టిగా మందలించాడని వార్తలొచ్చాయి. లోపల ఏం జరిగిందో తెలియదుగానీ చన్నీ తనపై ఆరోపణలు చేసిన అధికారిణికి క్షమాపణలు చెప్పేశారు. వివాదం అక్కడితో సద్దుమణిగింది.
సొషల్ మీడియాలో చరణ్‌జిత్ చన్నీ ముఖ్యమంత్రి అంటూ ప్రచారం మొదలుకాగానే ఆయనకు వ్యతిరేకంగా కూడా హల్ చల్ మొదలైంది. గతంలో వచ్చిన ‘మీటూ‘ ఆరోపణల్ని తవ్వి బటయకు తీస్తున్నారు కొందరు నెటిజన్స్. అంతే కాదు, ఈ మధ్య గుజరాత్ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన భూపేంద్ర పటేల్‌పై కాంగ్రెస్ అనుకూల సొషల్ మీడియా జనం తెగ సెటైర్లు వేశారు. ఆయన ట్విట్టర్ ఫాలోయర్స్ సంఖ్య 20 వేలు కూడా లేదంటూ విమర్శించారు. ఇప్పుడు బీజేపీ సపోర్టర్స్ చరణ్‌జిత్ ట్విట్టర్‌పై కన్నేశారు. ఆయనకు 600 మంది ఫాలోయర్స్ కూడా లేరంటూ వెటకారం మొదలు పెట్టారు...