మంచితనం ఇంకా మిగిలే ఉంది.. Saudi లో మరణశిక్ష పడిన భారతీయుడిని కాపాడేందుకు రూ.2 కోట్ల విరాళం..!

ABN , First Publish Date - 2022-05-21T20:07:28+05:30 IST

ప్రస్తుతం సమాజంలో డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనకాడటం లేదు. మానవత్వాన్ని మరచి మరీ దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే ఓ ఘటన మాత్రం సమాజంలో మంచితనం ఇంకా మిగిలే ఉందనే విష

మంచితనం ఇంకా మిగిలే ఉంది.. Saudi లో మరణశిక్ష పడిన భారతీయుడిని కాపాడేందుకు రూ.2 కోట్ల విరాళం..!

ఎన్నారై డెస్క్: ప్రస్తుతం సమాజంలో డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనకాడటం లేదు. మానవత్వాన్ని మరచి మరీ దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే ఓ ఘటన మాత్రం సమాజంలో మంచితనం ఇంకా మిగిలే ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. సౌదీలో మరణశిక్ష పడిన భారతీయుడిని కాపాడేందుకు అందరూ ఏకమయ్యారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


పంజాబ్‌కు చెందిన బల్వీందర్ సింగ్ ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం సౌదీ(Saudi) వెళ్లాడు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి అతడికి మధ్య 2013‌లో గొడవ జరిగింది. బల్వీందర్ బలంగా కొట్టడంతో అవతలి వ్యక్తి చనిపోయాడు. దీంతో అక్కడి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చారు. కేసుపై విచారణ జరిపిన కోర్టు.. బల్వీందర్‌ను దోషిగా తేల్చింది. అంతేకాకుండా అతడికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో పంజాబ్‌లో ఉన్న బల్వీందర్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సౌదీ కోర్టులో మెర్సీ పిటిషన్(క్షమాభిక్ష) దాఖలు చేశారు. 



దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. మృతుడి కుటుంబ సభ్యులకు నష్టపరిహారంగా రూ.2కోట్లు చెల్లించాలని ఆదేశించింది. చెల్లించలేని పక్షంలో ఉరిశిక్ష అమలవుతుందని స్పష్టం చేసింది. దీంతో పంజాబ్‌ ప్రజలు బల్విందర్‌కు అండగా నిలిచారు. విరాళాల రూపంలో రూ.2కోట్లను జమ చేశారు. అంతేకాకుండా ఆ మొత్తాన్ని సౌదీకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఈ సందర్భంగా బల్వీందర్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. బల్వీందర్ త్వరలోనే ఇండియాకు రానున్నట్టు వెల్లడించారు. కాగా.. విరాళాల సేకరణలో శిరోమణి గురుద్వార ప్రబంధక్ సమితి, పంజాబ్ ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయి. 


Updated Date - 2022-05-21T20:07:28+05:30 IST