ఈసారైనా‘కింగ్స్‌’ కావాలని..

ABN , First Publish Date - 2020-09-16T09:42:49+05:30 IST

ఇన్నేళ్లుగా ఎంతో మంది హార్డ్‌హిట్టర్లను చూసిన పంజాబ్‌ కింగ్స్‌ లెవన్‌ జట్టు టైటిల్‌ను మాత్రం ముద్దాడలేకపోయింది...

ఈసారైనా‘కింగ్స్‌’ కావాలని..

ఇన్నేళ్లుగా ఎంతో మంది హార్డ్‌హిట్టర్లను చూసిన పంజాబ్‌ కింగ్స్‌ లెవన్‌ జట్టు టైటిల్‌ను మాత్రం ముద్దాడలేకపోయింది. ఈసారి సరికొత్తగా ముస్తాబైన ఈ జట్టు కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపిస్తోంది. దీనికి తోడు కోచ్‌ పాత్రలో అత్యంత అనుభవజ్ఞుడు అనిల్‌ కుంబ్లే అండగా ఉండడం పంజాబ్‌కు కొండంత బలం.


ఐపీఎల్ పద్రర్శన

2008 సెమీస్

2014 రన్నరప్


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

శక్తిసామర్థ్యాలకు లోటు లేదు.. జట్టులో ధనాధన్‌ ఆటగాళ్లకు కూడా కొదవలేదు. అయినా పంజాబ్‌ జట్టు ఐపీఎల్‌లో ఇప్పటి వరకు విజేతగా నిలవలేకపోయింది. ప్రతీ సీజన్‌ను ఆశావహ దృక్పథంతో ఆరంభించడం.. అంచనాలు అందుకోలేక చతికిలపడడం కింగ్స్‌ లెవన్‌కు అలవాటుగా మారింది. అయితే రెండు సీజన్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన అశ్విన్‌ను వదులుకోవడంతో పంజాబ్‌ ఈసారి కేఎల్‌ రాహుల్‌ ఆధ్వర్యంలో టైటిల్‌ కల నెరవేర్చుకోవాలనుకుంటోంది. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి 12 సీజన్లను గమనిస్తే పంజాబ్‌ 2008, 2014లో మాత్రమే ప్లేఆ్‌ఫ్సకు చేరింది. అయితే ఈ జట్టుకు 2014లో యూఏఈ బాగానే కలిసివచ్చింది. అక్కడ ఐదు మ్యాచ్‌లు ఆడితే అన్నింట్లోనూ గెలిచింది. ఈ కారణంగానే ఫైనల్‌ వరకు రాగలిగింది. ఈ అనుకూలతను ఈసారి ఎలా సొమ్ము చేసుకుంటుందో చూడాలి.

బలం: కచ్చితంగా బ్యాటింగ్‌ లైన్‌పపైనే పంజాబ్‌ ఎక్కువగా ఆధారపడి ఉంది. ఓపెనింగ్‌ జోడీ రాహుల్‌, గేల్‌ విధ్వంసం గత సీజన్‌లో చూసిందే. వీరికి తోడు మయాంక్‌ అగర్వాల్‌, నికోలస్‌ పూరన్‌, మ్యాక్స్‌వెల్‌, కరుణ్‌ నాయర్‌, మన్‌దీ్‌ప, సర్ఫరాజ్‌ సత్తా కలిగిన ఆటగాళ్లే. ఇక ఆల్‌రౌండర్ల రూపంలో క్రిష్ణప్ప గౌతమ్‌, నీషమ్‌, దీపక్‌ హూడాలతో పాటు మ్యాక్స్‌వెల్‌ ఉన్నాడు. సహాయక బృందంలో హెడ్‌ కోచ్‌ కుంబ్లే, ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీ రోడ్స్‌, బ్యాటింగ్‌ కోచ్‌ వసీం జాఫర్‌, బౌలింగ్‌ కోచ్‌ లాంగ్‌వెల్ట్‌ల రూపంలో అనుభవజ్ఞులున్నారు.

బలహీనత: బౌలింగ్‌ విషయంలో మాత్రం సంతృప్తికరంగా కనిపించడం లేదు. పేసర్లు మహ్మద్‌ షమి, క్రిస్‌ జోర్డాన్‌లపై ఎక్కువగా ఆధారపడనుంది. సరైన డెత్‌ బౌలర్‌ లేకపోవడం కూడా లోటే. కరీబియన్‌ లీగ్‌లో చెలరేగిన అఫ్ఘాన్‌ స్పిన్నర్‌ ముజీబుర్‌ రహ్మాన్‌ కీలకం కానున్నాడు. మిగతా స్పిన్నర్లు గౌతమ్‌, సుచిత్‌, ఎం.అశ్విన్‌, రవి బిష్ణోయ్‌లకు పెద్దగా అనుభవం లేదు.


పంజాబ్‌ జట్టు.

స్వదేశీ ఆటగాళ్లు:  రాహుల్‌, మయాంక్‌, మన్‌దీ్‌ప సింగ్‌, హర్‌ప్రీత్‌ బార్‌, ఇషాన్‌ పోరెల్‌, తేజిందర్‌ సింగ్‌, కరుణ్‌ నాయర్‌, దీపక్‌ హూడా, రవి బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, షమి, దర్శన్‌ నల్‌కండే, ఎం.అశ్విన్‌, సుచిత్‌, గౌతమ్‌, సిమ్రన్‌ సింగ్‌.

విదేశీ ఆటగాళ్లు: గేల్‌, మ్యాక్స్‌వెల్‌, నీషమ్‌, జోర్డాన్‌, ముజీబుర్‌ రెహ్మాన్‌, కాట్రెల్‌, పూరన్‌, విల్జోన్‌.


Updated Date - 2020-09-16T09:42:49+05:30 IST