ఇంటర్ విద్యార్ధులకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు.. కొత్త పథకం ప్రారంభం..

ABN , First Publish Date - 2020-08-13T02:08:05+05:30 IST

ప్రభుత్వం ఎట్టకేలకు తన హామీని నిలబెట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12వ..

ఇంటర్ విద్యార్ధులకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు.. కొత్త పథకం ప్రారంభం..

చండీగఢ్: పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు తన హామీని నిలబెట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12వ తరగతి విద్యార్థులందరికీ స్మార్ట్‌ఫోన్లు ఉచితంగా అందించేందుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఈ పథకాన్ని అమలు చేయడం గమనార్హం. 2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రజాకర్షక హామీల్లో స్మార్ట్ ఫోన్ల పథకం కూడా ఒకటి. ఇవాళ జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ‘‘పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ పథకం’’ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్ధులకు స్వయంగా స్మార్ట్‌ఫోన్లు అందజేశారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26 చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. పలు జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మంత్రులు వ్యక్తిగతంగా ఒక్కొక్కరు 20 చొప్పన ఫోన్లు అందజేశారు. కాగా తొలివిడతలో భాగంగా ఈ పథకం కింద 1,74,015 మంది విద్యార్ధులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో 1.11 లక్షల మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్ధులే ఉండడం విశేషం. 

Updated Date - 2020-08-13T02:08:05+05:30 IST