పేదలకు 25 వేల ఇళ్లు నిర్మించేందుకు క్యాబినెట్ సమ్మతి

ABN , First Publish Date - 2021-02-25T18:08:33+05:30 IST

పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు...

పేదలకు 25 వేల ఇళ్లు నిర్మించేందుకు క్యాబినెట్ సమ్మతి

చండీగఢ్: పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు చేయూతనిచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన 25 వేల మందికి పక్కా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. అధికారికంగా తెలిసిన వివరాల ప్రకారం రాష్ట్ర క్యాబినెట్ దీనికి సంబంధించిన నూతన ఈడబ్ల్యుఎస్ పాలసీకి అనుమతినిచ్చింది. బలహీన వర్గాల వారికి కేటాయించే ఈ ఇళ్లతో పాటు కమ్యూనిటీ సెంటర్, డిస్పెన్సరీ మొదలైన సదుపాయాలు కూడా కల్పించనున్నారు. ఈ నూతన గృహాలను బ్రిక్‌లెస్ టెక్నిక్ ఆధారంగా నిర్మించనున్నారు. ఈ ఇళ్లను పంజాబ్ రాష్ట్రంలో పదేళ్ల నుంచి ఉంటున్న బలహీన వర్గాల వారికి కేటాయించనున్నారు. 

Updated Date - 2021-02-25T18:08:33+05:30 IST