Abn logo
Sep 28 2021 @ 15:19PM

సిద్ధూ రాజీనామా... కాంగ్రెస్‌ అధిష్టానానికి షాక్!

న్యూఢిల్లీ: నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి షాక్ ఇచ్చారు. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్‌ విషయంలో రాజీపడబోనంటూ లేఖ రాసి పార్టీ అధిష్టానానికి పంపారు. అయితే కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సిద్ధూకు కొంత కాలం క్రితమే పంజాబ్ పీసీసీ పదవిని అధిష్టానం కట్టబెట్టింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తన అనుయాయులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే అసంతృప్తి కారణంగానే రాజీనామా చేసినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీకి ప్రయాణం కావడం, బీజేపీ పెద్దలను కలుస్తారనే ప్రచారం జరగడంతో పంజాబ్‌ రాజకీయాలు వేడెక్కాయి. 


ఇవి కూడా చదవండిImage Caption