Kali Bein Explained: సిక్కుల పవిత్ర నది ప్రాముఖ్యత ఇదే... పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ నీటిని ఎందుకు తాగారంటే...

ABN , First Publish Date - 2022-07-23T14:33:42+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిక్కులు పవిత్రంగా...

Kali Bein Explained: సిక్కుల పవిత్ర నది ప్రాముఖ్యత ఇదే... పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ నీటిని ఎందుకు తాగారంటే...

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిక్కులు పవిత్రంగా భావించే కాలీ బీన్‌లోని నీటిని తాగిన కారణంగా అస్వస్థతకు గురయ్యారు. కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం సీఎం సుల్తాన్‌పూర్ లోధి వద్ద పవిత్ర కాళీ బీన్‌లోని ఒక గ్లాసు నీరు తాగారు. సిక్కు మతంలో కాలీ బీన్‌ను ఎందుకు పవిత్రంగా భావిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. 



కాలీ బీన్ ఒక పవిత్ర జల వనరు. దీనిని పవిత్ర కాలువ, పవిత్ర చెరువు లేదా పవిత్ర నది అని కూడా పిలుస్తారు. దీని పొడవు దాదాపు 165 కిలోమీటర్లు. పంజాబ్‌లో ఈ నది నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇది కపుర్తలా వద్ద బియాస్ నది, సట్లెజ్ నదులను కలుస్తుంది. ఈ పవిత్ర నది ఒడ్డున 80కి పైగా గ్రామాలు, పట్టణాలు విస్తరించి ఉన్నాయి. ఈ గ్రామాలు, పట్టణాల్లోని డ్రెయిన్ల ద్వారా వచ్చే నీరు ఈ నదిలో కలుస్తుంది. సిక్కుమతంలో కలీ బీన్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సిక్కు మొదటి గురువు గురునానక్ దేవ్ ఇక్కడ స్నానం చేసేవారని చెబుతారు. అతను ఇక్కడే జ్ఞానం పొందాడంటారు. గురునానక్ దేవ్ తన సోదరి బెబే నాంకీతో కలిసి సుల్తాన్‌పూర్ లోడిలో ఉన్నప్పుడు, అతను కాలీ బీన్‌లో స్నానం చేసేవారు. అప్పట్లో ఈ నది శుభ్రంగా ఉండేది. కాలక్రమేణా ఈ పవిత్ర నది మురికిగా, నల్లగా మారింది. అటువంటి పరిస్థితిలో నదిని శుభ్రం చేయడానికి ప్రచారం ప్రారంభించారు. పంజాబ్ పర్యావరణవేత్త, సంత్ బల్బీర్ సింగ్ ఈ ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈ క్లీనింగ్ ప్రాజెక్ట్ 22వ వార్షికోత్సవం సందర్భంగా పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ను ఆహ్వానించారు. ప్రస్తుతం కాలీ బీన్‌లోని నీరు తేటగా కనిపించింది. అందుకే సీఎం భగవంత్ మాన్ ఈ పవిత్ర నది నీటిని తాగారు. 

Updated Date - 2022-07-23T14:33:42+05:30 IST