భగత్ సింగ్ వర్ధంతి.. పంజాబ్‌లో సెలవు ప్రకటించిన సీఎం

ABN , First Publish Date - 2022-03-22T18:48:01+05:30 IST

స్వాతంత్ర సమరయోధులైన భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్, శివ్‌రామ్ రాజ్‌గురులు అమరులైన రోజు మార్చి 23. అమరుల దినోత్సవంగా జరుపుకునే ఈ రోజున రాష్ట్రంలో సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి భగవంత్ మన్.

భగత్ సింగ్ వర్ధంతి.. పంజాబ్‌లో సెలవు ప్రకటించిన సీఎం

స్వాతంత్ర సమరయోధులైన భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్, శివ్‌రామ్ రాజ్‌గురులు అమరులైన రోజు మార్చి 23. అమరుల దినోత్సవంగా జరుపుకునే ఈ రోజున రాష్ట్రంలో సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి భగవంత్ మన్. ఈ విషయంపై అసెంబ్లీలో భగవంత్ మంగళవారం ప్రకటన చేశారు. అలాగే అసెంబ్లీలో భగత్ సింగ్‌తోపాటు, అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ నిర్ణయానికి అసెంబ్లీ అమోదం తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో భగత్ సింగ్, అంబేద్కర్ ఫొటోలు తప్ప, తన ఫొటోలు కనిపించకూడదని భగవంత్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో 25,000 పోస్టుల భర్తీకి కూడా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. 

Updated Date - 2022-03-22T18:48:01+05:30 IST