హిందూ గ్రంథాలయ పరిశోధనకు కేంద్రం: పంజాబ్ సీఎం చన్నీ

ABN , First Publish Date - 2021-12-03T00:39:18+05:30 IST

అకాలీదళ్ మహాభారతంలోని కౌరవుల వంటిది. కౌరవులకు అకాలీదళ్‌కు చాలా పోలికలు ఉన్నాయి. పార్టీ అగ్రనేత ప్రకాష్ సింగ్ బాదల్ తన కుమారుడిపై ప్రేమ కారణంగా అకాలీదళ్ గందరగోళంలో పడింది. మహాభారతంలో కూడా ఇలాంటి ఒక సందర్భం ఉంది..

హిందూ గ్రంథాలయ పరిశోధనకు కేంద్రం: పంజాబ్ సీఎం చన్నీ

చండీగఢ్: హిందూ మత పవిత్ర గ్రంథాలైన రామాయణం, మహాభారతం, భాగవతాలపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రకటించారు. గురువారం పగ్వారా జిల్లాలో పరుశరామ తపోస్తల్ కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం చన్నీ మాట్లాడుతూ మానవత్వ వికాసానికి ప్రేరణకు ఈ గ్రంథాలు ఎంతో స్ఫూర్తిదాయకమని, వీటిపై మరింత అధ్యయనం జరగాలని అన్నారు.


‘‘శంకరాచార్య స్ఫూర్తితో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. చారిత్రాత్మక ప్రాంతంగా పరుశరామ తపోస్తలాన్ని మేం అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి 10 కోట్ల రూపాయల చెక్కును అందజేశాము. భవిష్యత్‌లో మరిన్ని నిధుల్ని అందిస్తాం’’ అని చన్నీ అన్నారు. ఇక రాష్ట్రంలో విచ్చలవిడిగా తిరిగే పశువుల సంరక్షణ బాధ్యతను బ్రాహ్మణులకు అప్పగించనున్నట్లు సీఎం తెలిపారు.


ఇక మహాభారతాన్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీ అకాలీదళ్‌పై చన్నీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘అకాలీదళ్ మహాభారతంలోని కౌరవుల వంటిది. కౌరవులకు అకాలీదళ్‌కు చాలా పోలికలు ఉన్నాయి. పార్టీ అగ్రనేత ప్రకాష్ సింగ్ బాదల్ తన కుమారుడిపై ప్రేమ కారణంగా అకాలీదళ్ గందరగోళంలో పడింది. మహాభారతంలో కూడా ఇలాంటి ఒక సందర్భం ఉంది’’ అని సీఎం చన్నీ అన్నారు.

Updated Date - 2021-12-03T00:39:18+05:30 IST