చండీగఢ్: వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై చేపట్టిన ఆందోళన సందర్భంగా ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోవడం పట్ల పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులు గుర్జంత్ సింగ్, గుర్బచన్ సింగ్ల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇరు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మాన్సా జిల్లా బచ్చోనా గ్రామానికి చెందిన గుర్జంత్ సింగ్... ఢిల్లీలో చేపట్టిన ఆందోళనలో మృతి చెందగా.. మోగా జిల్లా భిందర్ ఖుర్ద్ గ్రామానికి చెందిన గుర్బచన్ సింగ్ బుధవారం మోగాలో చేపట్టిన ధర్నాలో గుండెపోటుతో మృతిచెందారు.