Punjab polls:50 శాతం ఓటర్లున్న మహిళలకు 10 శాతం సీట్లు

ABN , First Publish Date - 2022-02-03T15:57:12+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలో 50 శాతం ఓటర్లు ఉన్న మహిళలకు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 10 శాతం మందికి మాత్రమే రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చాయి....

Punjab polls:50 శాతం ఓటర్లున్న మహిళలకు 10 శాతం సీట్లు

చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలో 50 శాతం ఓటర్లు ఉన్న మహిళలకు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 10 శాతం మందికి మాత్రమే రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చాయి.మహిళల ఓట్లను పొందడం కోసం యత్నిస్తున్న పార్టీలు వారికి ఓటర్ల సంఖ్య ప్రాతిపదికగా ప్రాతినిథ్యం కల్పించడంలో విఫలమయ్యారు.పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 2.77 కోట్లమంది ఓటర్లు ఉండగా అందులో 1.31 కోట్ల మంది మహిళలున్నారు.పంజాబ్ రాష్ట్రంలో మహిళలను ఓటర్లుగా చూస్తున్నారు తప్ప వారికి సీట్లు మాత్రం వారి జనాభా దామాషాలో కేటాయించడం లేదు.మహిళలకు తాము గెలిస్తే రూ.1000 నుంచి 2వేల రూపాయల వదరకు నెలవారీ నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని పలు పార్టీలు హామీలు ఇచ్చాయి. 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి మహిళకు వెయ్యిరూపాయలు నగదు ఇస్తామని ఆమ్ ఆద్మీపార్టీ హామి ఇచ్చింది. కాగా తాము నెలకు రూ.2వేలు ఇస్తామని కాంగ్రెస్,ఆకాలీదళ్ పార్టీలు ప్రకటించాయి.


 తాము 8 ఉచిత ఎల్‌పిజీ సిలిండర్లను ఇస్తామని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సిద్దూ ప్రకటించారు.117 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ 11 మంది మహిళలకు, ఆప్ 12 మంది మహిళలకు, బీజేపీ-పిఎల్‌సి-ఎస్‌ఎడి (సంయుక్త్) కూటమి ఎనిమిది మందికి, ఎస్‌ఎడి-బిఎస్‌పి కూటమి కేవలం ఐదుగురు మహిళలకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది.మహిళలకు కనీసం 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ 9.40 శాతం మందికి మాత్రమే టిక్కెట్లు ఇచ్చింది. అయితే ఆప్ 10.25 శాతం మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చింది.127 మంది మహిళలు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.ఇతర పార్టీలతో పోలిస్తే పంజాబ్‌లో ఆప్ అత్యధిక సంఖ్యలో మహిళలను రంగంలోకి దించిందని ఆమ్ ఆద్మీ పార్టీ  అన్మోల్ గగన్ మాన్ చెప్పారు.


Updated Date - 2022-02-03T15:57:12+05:30 IST