Tokyo Olympics Hockeyలో స్వర్ణం తెస్తే ఒక్కొక్కరికి రూ. 2.25 కోట్లు!

ABN , First Publish Date - 2021-07-31T00:20:47+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న భారత హాకీ జట్టు ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ఒలింపిక్స్‌లో కనుక

Tokyo Olympics Hockeyలో స్వర్ణం తెస్తే ఒక్కొక్కరికి రూ. 2.25 కోట్లు!

చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో అదరగొడుతున్న భారత హాకీ జట్టు ఆటగాళ్లకు పంజాబ్ ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. ఒలింపిక్స్‌లో కనుక స్వర్ణ పతకం సాధిస్తే కోట్లాది రూపాయలు ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు పంజాబ్ క్రీడామంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోదీ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. భారత జట్టు పసిడితో తిరిగివస్తే జట్టులో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 2.25 కోట్లు ఇస్తామని తెలిపారు.     


ఒలింపిక్స్‌లో మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తోంది. నేడు జపాన్‌తో జరిగిన పూల్-ఎ చివరి మ్యాచ్‌లో 5-3తో విజయం సాధించింది. భారత జట్టుకు ఇది వరుసగా మూడో విజయం కావడం గమనార్హం. ఇప్పటికే క్వార్టర్స్‌కు చేరుకున్న భారత జట్టు పతకంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం గమనార్హం.

Updated Date - 2021-07-31T00:20:47+05:30 IST