Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 30 Oct 2021 10:30:16 IST

పునీత్‌ మరణం బాధాకరం: తమిళ నిర్మాతల మండలి

twitter-iconwatsapp-iconfb-icon

అడయార్‌(Chennai): కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం పట్ల తమిళనాడు చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని తెలిపింది. ఇదే విషయంపై నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎన్‌.రామస్వామి (మురళి) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కన్నడ చిత్రపరిశ్రమలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌ హీరోగా కొనసాగుతున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ హఠాన్మరణ వార్త తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. కన్నడ చిత్రసీమలో ప్రత్యేక ఛరిష్మాతో తన తండ్రి, దివంగత నటుడు రాజ్‌కుమార్‌ బాటలో పయనిస్తున్న పునీత్‌ మృతి తీవ్రంగా కలిచివేసింది. ఆయన మృతిపై తమిళ చిత్ర నిర్మాతల మండలి తరపునే కాకుండా తమిళనాడు ప్రజల తరపున ఆయన కుటుంబ సభ్యు లకు, అభిమానులకు తీవ్ర సంతాపం తెలపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే కోలీవుడ్‌ హీరో విశాల్‌, నటి రాధిక, సీనియర్‌ నటుడు నాజర్‌ తదితరులు తమ సంతాపాలను వ్యక్తం చేశారు. ఇదిలావుండగా పునీత్‌ రాజ్‌కుమార్‌ మద్రాస్‌లోనే జన్మించారు. అతనికి ఆరేళ్ల వయసులో పునీత్‌  తండ్రి దివంగత సీనియర్‌ నటుడు రాజ్‌కుమార్‌ తన కుటుంబాన్ని బెంగుళూరుకు తరలించారు.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

OtherwoodsLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement