ఆసుపత్రికి వచ్చేసరికే... హార్ట్‌లైన్‌లో మార్పులు

ABN , First Publish Date - 2021-10-30T17:08:51+05:30 IST

నటుడు పునీత్‌రాజ్‌కుమార్‌ విక్రమ్‌ ఆసుపత్రికి చేరుకునేసరికే హార్ట్‌లైన్‌ పూర్తిగా స్ట్రెయిట్‌గా మారిపోయిందని వైద్యులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురై

ఆసుపత్రికి వచ్చేసరికే... హార్ట్‌లైన్‌లో మార్పులు

బెంగళూరు(Karnataka): నటుడు పునీత్‌రాజ్‌కుమార్‌ విక్రమ్‌ ఆసుపత్రికి చేరుకునేసరికే హార్ట్‌లైన్‌ పూర్తిగా స్ట్రెయిట్‌గా మారిపోయిందని వైద్యులు వెల్లడించారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురై తుద్విశ్వాస వీడిన విషయం తెలిసిందే. ఈమేరకు విక్రమ్‌ ఆసుపత్రి వైద్యులు మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చేసరికే ఈసీజీ చేసి గుండెపోటుగా గుర్తించామన్నారు. చేరేసరికే ఏమాత్రం స్పందన లేదన్నారు. హార్ట్‌లైన్‌ పూర్తిగా స్ట్రెయిట్‌గా మారిందన్నారు. వైద్యనిపుణులు మూడుగంటలపాటు తీవ్ర ప్రయత్నం చేశామని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాలేదని, మధ్యాహ్నం 2.30గంటలకు పునీత్‌ తుదిశ్వాస వీడినట్టు ప్రకటించారు. 

Updated Date - 2021-10-30T17:08:51+05:30 IST