పునీత్‌ సమాధి దర్శనానికి వికలాంగుడి పాదయాత్ర

ABN , First Publish Date - 2022-01-23T18:20:23+05:30 IST

పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని చూసేందుకు అభిమాని యాదగిరి జిల్లా వైకూరుకు చెందిన రవికుమార్ ఈ నెల 12వ తేదీన బయలుదేరాడు. ఆయన పాదయాత్ర శనివారం ఉదయం బళ్లారి నగరానికి చేరు

పునీత్‌ సమాధి దర్శనానికి వికలాంగుడి పాదయాత్ర

బళ్లారి(కర్ణాటక): పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని చూసేందుకు అభిమాని యాదగిరి జిల్లా వైకూరుకు చెందిన రవికుమార్ ఈ నెల 12వ తేదీన బయలుదేరాడు. ఆయన పాదయాత్ర శనివారం ఉదయం బళ్లారి నగరానికి చేరుకుంది. దీంతో అతనిని కొందరు ప్రశ్నించగా ఆయన పునిత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని చూసేందుకు బెంగళూరుకు పాదయాత్రగా వెళుతున్నానని చెప్పడంతో అర్జున్‌ ఫ్రెండ్స్‌ ధ్రువసర్జ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షులు ఎంపీ కనక నేతృత్వంలో సన్మానం చేసి, పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో యువరాజు, ఉమేష్‌, మణికంఠ, శ్రీనివాస్‌, విజయభాస్కర్‌, నందీష్‌, ధ్రువసర్జ అభిమానులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-23T18:20:23+05:30 IST