పునీత్‌ సమాధి వీక్షణకై సైకిల్‌పై బయల్దేరిన అభిమాని

ABN , First Publish Date - 2021-11-14T18:13:36+05:30 IST

పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ సమాధిని దర్శించుకునేందుకు అభిమానులు నిత్యం తరలివస్తూనే వస్తున్నారు. అయితే బాగల్కోటెకు చెందిన రాఘవేంద్ర గాణిగేర తన అభిమాన నటుడు పునీత్‌ సమాధిని

పునీత్‌ సమాధి వీక్షణకై సైకిల్‌పై బయల్దేరిన అభిమాని

బెంగళూరు(Karnataka): పవర్‌స్టార్‌ పునీత్‌రాజ్‌కుమార్‌ సమాధిని దర్శించుకునేందుకు అభిమానులు నిత్యం తరలివస్తూనే వస్తున్నారు. అయితే బాగల్కోటెకు చెందిన రాఘవేంద్ర గాణిగేర తన అభిమాన నటుడు పునీత్‌ సమాధిని చూసేందుకు సైకిల్‌పై మూడు రోజులక్రితం బయల్దేరాడు. బాగల్కోటె నుంచి బెంగళూరుకు సుమారు 600 కిలోమీటర్ల దూరం ఉంది. అంత్యక్రియలవేళ చూసేందుకు సాధ్యం కాలేదని, పునీత్‌కు సైక్లింగ్‌ అంటే ఎంతో ఇష్టమని అందుకే సైకిల్‌పై బయల్దేరినట్టు రాఘవేంద్ర పేర్కొన్నారు. శనివారం ఆయన చిత్రదుర్గకు చేరుకోగా స్థానికులు అతడిని ఆత్మీయంగా స్వాగతించి వీడ్కోలు పలికారు. రోజుకు సుమారు వంద కిలోమీటర్ల మేర సైకిల్‌ తొక్కుతున్నట్టు రాఘవేంద్ర తెలిపారు.

Updated Date - 2021-11-14T18:13:36+05:30 IST