Karnataka: కాకతాళీయమే అయినా...

ABN , First Publish Date - 2021-10-31T17:00:01+05:30 IST

విధి ఆట ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది. 17వ తేదీన జన్మించడమే ఈ యువనటుల పాలిట శాపంగా మారిందా? అభిమాని ఒకరు ఈ మేరకు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌ భారీగా వైరల్‌ అవుతోంది. పవర్‌స్టా

Karnataka: కాకతాళీయమే అయినా...

- వారంతా 17వ తేదీన జన్మించారు 

- గుండెపోటుతోనే తనువు చాలించారు


బెంగళూరు(Karnataka): విధి ఆట ఒక్కోసారి విచిత్రంగా ఉంటుంది. 17వ తేదీన జన్మించడమే ఈ యువనటుల పాలిట శాపంగా మారిందా?  అభిమాని ఒకరు ఈ మేరకు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌ భారీగా వైరల్‌ అవుతోంది. పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ 1975 మార్చి 17న జన్మించారు. ఆయన తీవ్ర గుండెపోటుకు గురై శుక్రవారం హఠాన్మరణం పొందారు. అలాగే మరో కన్నడ నటుడు చిరంజీవి సర్జా 1984 అక్టోబరు 17న జన్మించారు. ఆయన కూడా ఇటీవల గుండెపోటుకు గురై తనువు చాలించారు. ప్రముఖ కన్నడ నటుడు సంచారి విజయ్‌ 1983 జూలై 17న జన్మించారు. ఆయన కూ డా కొద్ది నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో కన్నడ నటుడు రఘువీర్‌ మే 17న జన్మించారు. ఆయన కూడా గతంలో గుండెపోటుకు బలయ్యారు. కాకతాళీయమే అయినా ఈ నటుల పుట్టినతేదీ ఒక్కటే కావడం వీరిలో అత్యధికులు గుండెపోటుకు గురై మృతి చెందడం విధి విచిత్రమే సుమా.

Updated Date - 2021-10-31T17:00:01+05:30 IST