‘పని్‌షమెంట్లను రద్దుచేయాలి’

ABN , First Publish Date - 2022-05-23T05:10:56+05:30 IST

నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన పని్‌షమెంట్లను వెంట నే రద్దుచేయాలని ఆర్‌టీసీ నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.వి.శివారెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు.

‘పని్‌షమెంట్లను రద్దుచేయాలి’
సమావేశంలో మాట్లాడుతున్న శివారెడ్డి

కడప (మారుతీనగర్‌), మే 22: నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన పని్‌షమెంట్లను వెంట నే రద్దుచేయాలని ఆర్‌టీసీ నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.వి.శివారెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. ఇం దుకు నిరసనగా ఆదివారం యూనియన్‌ కార్యాలయంలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లా డుతూ అన్ని డిపోల్లో కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చేతులెత్తేశారన్నారు.

మైదుకూరు డిపోలో సంబంధిత డిపో సూపరింటెండెంట్‌ ఏకపక్షధోరణితో అసోసియేషన్‌ నేతలు, ఉద్యోగులను వేదిస్తున్నారని ఆరో పించారు. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, డిపోల్లో ఉద్యోగులు పలు సమస్యలతో సతమతమవుతున్నా యాజమాన్యం నిమ్మకునీరెత్తినట్లు గా వ్యవహరిస్తున్నతీరు దారుణమన్నారు. కడప బస్టాండులో తిరుపతి సర్వీసులకు ప్లాట్‌ఫాం కేటాయించాలన్నారు. ఎన్‌ఎంయూఏ నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T05:10:56+05:30 IST