పోక్సో, మహిళల కేసుల్లో శిక్షలు పడేశాతాన్ని పెంచాలి

ABN , First Publish Date - 2022-06-26T06:11:26+05:30 IST

పోక్సో, మహిపోక్సో, మహిళల కేసుల్లో శిక్షలు పడే శాతాన్ని పెంచాలని, ప్రతి కేసు దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండాలని రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు.

పోక్సో, మహిళల కేసుల్లో శిక్షలు పడేశాతాన్ని పెంచాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీపీ వి సత్యనారాయణ

- డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 25: పోక్సో, మహిపోక్సో, మహిళల కేసుల్లో శిక్షలు పడే శాతాన్ని పెంచాలని, ప్రతి కేసు దర్యాప్తులో నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండాలని రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక ఇన్వెస్టిగేషన్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లతో పెండింగ్‌ కేసులు, ఫంక్షనల్‌ వర్టికల్‌ గురించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులు కేసుల దర్యాప్తులో ఏమైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. సీసీటీఎన్‌ఎస్‌ వర్షన్‌ 2.0 అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేశామన్నారు. కేసుల్లో నేరస్థులకు శిక్షపడితే క్రైం రేట్‌ తగ్గుతుందన్నారు. కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడేలా అన్నికోణాల్లో కేసుల పరిశోధన ఉండాలన్నారు.  ఎస్సీ ఎస్టీ, పొక్సో, కైం ఎగనెస్ట్‌ ఉమన్‌ కేసుల్లో సంబంధిత బాధితులకు త్వరగా నష్టపరిహారం వచ్చేలా అన్ని విభాగాల అధికారులతో ప్రతిరోజు సమీక్షించాలన్నారు. గంజాయిపై నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి రివార్డులు, అవార్డులు అందజేస్తామని డీజీపీ తెలిపారు. సైబర్‌ నేరాలపై నిఘా పెంచాలన్నారు. కాన్ఫరెన్స్‌లో పోలీస్‌కమిషనర్‌ వి సత్యనారాయణ, అడిషనల్‌ డీసీపీలు ఎస్‌ శ్రీనివాస్‌, జి చంద్రమోహన్‌, ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కాశయ్య, సత్యనారాయణ, విజయ్‌కుమార్‌, ప్రతాప్‌, ఎస్‌బీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:11:26+05:30 IST