ఇంటర్‌స్టేట్‌ కరాటే పోటీల్లో పుంగనూరు హవా

ABN , First Publish Date - 2021-09-29T06:34:35+05:30 IST

కర్నూలులో ఈనెల 26న జరిగిన ఇంటర్‌స్టేట్‌ కరాటే పోటీల్లో పుంగనూరు విద్యార్థులు హవా చాటినట్లు జిల్లా కరాటే అసోషియేషన్‌ అధ్యక్షుడు సునీల్‌ తెలిపారు.

ఇంటర్‌స్టేట్‌ కరాటే పోటీల్లో పుంగనూరు హవా
కరాటే పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు

పుంగనూరు, సెప్టెంబరు 28: కర్నూలులో ఈనెల 26న జరిగిన ఇంటర్‌స్టేట్‌ కరాటే పోటీల్లో పుంగనూరు విద్యార్థులు హవా చాటినట్లు జిల్లా కరాటే అసోషియేషన్‌ అధ్యక్షుడు సునీల్‌ తెలిపారు. మంగళవారం జరిగిన స్థానిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణానికి చెందిన అక్షర, ప్రణీత, సాయిచరణ్‌, వేదవిహార్‌రెడ్డి, సుదర్శన్‌, రోషన్‌, ప్రణయప్రీతిక, విగ్నేష్‌, ధాత్రిలు కుమితే, కటా విభాగాల్లో ప్రథమ, ద్వితీయస్థానాల్లో నిలిచినట్లు చెప్పారు. వీరందరూ త్వరలో బెంగళూరులో జరిగే రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో పాల్గొననున్నట్లు గుర్తుచేశారు. 

Updated Date - 2021-09-29T06:34:35+05:30 IST