Abn logo
Jun 4 2020 @ 21:26PM

స్టార్ హీరో వర్కవుట్స్ చూసి ఫిదా అవుతున్నారు

ఈ కరోనా లాక్‌డౌన్‌లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇక సెలబ్రిటీలు ఈ లాక్‌డౌన్‌ను చాలా బాగా వినియోగించుకున్నారు. ఫిట్‌నెస్ కోసం వర్కవుట్స్‌తో బాడీలను సరైన షేప్‌లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. వాళ్లు వర్కవుట్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన, అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ స్టార్ హీరో వర్కవుట్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో అనుకుంటున్నారా? కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్.


ఇప్పటి వరకు సోషల్ మీడియాలో హీరోయిన్లు వర్కవుట్స్ చేస్తున్న వీడియోలే వైరల్ అవుతూ వచ్చాయి. కానీ ట్విట్టర్‌లో పునీత్ వర్కవుట్ ఆఫ్ ది డే అంటూ షేర్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరలయ్యింది. అందులో పునీత్ వర్కవుట్స్ చూసిన వాళ్లంతా ఔరా అనాల్సిందే. అల్రెడీ సెలబ్రిటీలు కూడా పునీత్ వర్కవుట్స్‌పై కామెంట్స్ చేస్తున్నారంటే ఏ రేంజ్‌లో అతని వర్కవుట్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకా డౌట్‌గా ఉంటే క్రింది వీడియోలో చూడండి మరి. 


Advertisement
Advertisement
Advertisement