కంపెనీలో భాగస్వామిగా ఉంటూ.. ఈ ప్రవాస భారతీయుడు ఎంత పని చేశాడో చూడండి..

ABN , First Publish Date - 2021-11-12T21:23:06+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ప్రవాస భారతీయుడు అరెస్ట్ అయ్యాడు. ఆయనపై నమోదైన రెండు అభియోగాలు రుజువైతే.. ఒక్కో దానిలో అతడికి 20ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా.. ఇందుకు సంబంధించిన

కంపెనీలో భాగస్వామిగా ఉంటూ.. ఈ ప్రవాస భారతీయుడు ఎంత పని చేశాడో చూడండి..

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో ప్రవాస భారతీయుడు అరెస్ట్ అయ్యాడు. ఆయనపై నమోదైన రెండు అభియోగాలు రుజువైతే.. ఒక్కో దానిలో అతడికి 20ఏళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన పునీత్ దీక్షిత్.. న్యూయార్క్‌లోని మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ మెక్సిన్సే అండ్ కంపెనీలో పార్ట్‌నర్‌గా ఉన్నాడు. ఈ క్రమంలోనే మెకిన్సే క్లయింట్ అయిన గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్.. గ్రీన్‌స్కై అనే సంస్థను కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పునీత్ దీక్షిత్‌కు తెలిసి.. ఆ సమాచారన్ని దుర్వినియోగం చేశాడు. కొనుగోలు ప్రకటన వెలువడిన అనంతరం కొద్ది రోజుల్లో ముగిసిపోయే గ్రీన్ స్కై అవుట్ ఆఫ్ మనీ కాల్ ఆప్షన్లను పునీత్ దీక్షిత్ చౌకగా కొనుగోలు చేశాడు. టేకోవర్ ప్రకటన వెలువడిన తర్వాత గ్రీన్‌స్కై షేర్ల ధరలు ఏకంగా 44శాతం పెరగడంతో కాల్ ఆప్షన్లు కూడా భారీగా పెరిగాయి. ఈ సమయంలో తాను కొనుగోలు చేసిన కాల్ ఆప్షన్లను విక్రయించి.. పునీత్ దీక్షిత్ లాభపడ్డారని సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజీ కమిషన్(ఎస్ఈసీ) ఆరోపించింది. పునీత్ దీక్షిత్ సుమారు 4,50,000 డాలర్ల వరకూ అక్రమంగా లాభాలను ఆర్జినించినట్లు ఎస్ఈసీ అభియోగాలు మోపింది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే.. పునీత్ దీక్షిత్‌కు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.  




Updated Date - 2021-11-12T21:23:06+05:30 IST