పంక్చువేషన్స్‌తో ఫన్‌!

ABN , First Publish Date - 2020-04-29T06:39:15+05:30 IST

ఇండోర్‌ గేమ్స్‌తో టైం పాస్‌ అవుతుంది. అయితే గేమ్‌లోకి సబ్జెక్ట్‌ను కూడా తెస్తే బోలెడు ఫన్‌ దొరుకుతుంది. ఇంకెందుకాలస్యం... ఇలా చేయండి...

పంక్చువేషన్స్‌తో ఫన్‌!

  • ఇండోర్‌ గేమ్స్‌తో టైం పాస్‌ అవుతుంది. అయితే గేమ్‌లోకి సబ్జెక్ట్‌ను కూడా తెస్తే బోలెడు ఫన్‌ దొరుకుతుంది. ఇంకెందుకాలస్యం... ఇలా చేయండి.

కావలసినవి: నాలుగు ఇండెక్స్‌ కార్డులు

  1. మీకు పంక్చువేషన్‌ గుర్తులు తెలుసు కదా! స్కూల్‌లో నేర్చుకునే ఉంటా రు. ఇప్పుడు వాటితోనే గేమ్‌! ముందుగా ఇండెక్స్‌ కార్డులపై పంక్చువేషన్‌ గుర్తులు ఫుల్‌స్టాప్‌, కామా, ప్రశ్న గుర్తు, ఆశ్చర్యార్థకం గీయండి. 
  2. ఒక్కో గుర్తుకు ఒక్కో విధంగా నటించాలి. ఏ గుర్తుకు ఎలా నటించాలో ముందుగానే నిర్ణయించుకోండి.
  3. ఫుల్‌స్టాప్‌ గుర్తు చూపిస్తే ఆగిపోవాలి. కామా గుర్తు చూపిస్తే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లాలి. ప్రశ్న గుర్తు కనిపిస్తే ఆగి తల కిందకు దించుకోవాలి. ఆశ్చర్యార్థకం వస్తే చేతులు పైకెత్తి ఊపుతూ ఎగరాలి. 
  4. ఆట ఆడే వ్యక్తి ఒకవైపు, మిగతా వాళ్లందరూ మరోవైపు ఉండాలి. స్టార్టింగ్‌ లైన్‌, ఎండింగ్‌ లైన్‌ గీయాలి. స్టార్టింగ్‌ లైన్‌ దగ్గర నిలుచుని, గుర్తుకు అనుగుణంగా యాక్షన్‌ చేస్తూ ఎండింగ్‌ లైన్‌ చేరుకోవాలి. 
  5. ఒకవేళ మీరు చూపించిన గుర్తుకు తప్పుగా యాక్షన్‌ చేస్తే అతను అవుట్‌ అయినట్టు. తిరిగి స్టార్టింగ్‌ లైన్‌ నుంచి రావాలి. యాక్షన్‌ సరిగ్గా చేస్తూ ఎండింగ్‌ లైన్‌ చేరుకున్న వాళ్లు గెలిచినట్టు!

Updated Date - 2020-04-29T06:39:15+05:30 IST