డేంజర్‌ జోన్‌ ప్రజలకు పునరావాసం కల్పించాలి

ABN , First Publish Date - 2022-05-24T04:59:39+05:30 IST

మంగంపేట డేంజర్‌ జోన్‌ ప్రజలకు పునరావాసం కల్పించాలని డీహెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

డేంజర్‌ జోన్‌ ప్రజలకు పునరావాసం కల్పించాలి
రాజంపేట: మంగంపేట పునరావాస సమస్యలు వివరిస్తున్న డీహెచ్‌పీఎస్‌ నాయకులు

రాజంపేట, మే 23 : మంగంపేట డేంజర్‌ జోన్‌ ప్రజలకు పునరావాసం కల్పించాలని డీహెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. రాజం పేట లోని సబ్‌కలెక్టర్‌ కార్యాల యంలో సోమవారం ఆర్డీవో కోదండరామిరెడ్డి ఆధ్వ ర్యంలో స్పందన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజం పేట, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు, ప్రజలు అర్జీలుసమర్పించారు.  మంగంపేట డేంజర్‌ జోన్‌ ప్రజలకు పునరావాసం కల్పించాలని డీహెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.  డీహెచ్‌పీఎస్‌ జిల్లా వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ ఎస్‌.శంకరయ్య, సీపీఐ నియోజకవర్గ కార్య దర్శి పి.హేష్‌, కార్యవర ్గసభ్యులు ఎం. శివరామకృష్ణ దేవర, కోడూరు నాయకులు ఎస్‌.సుదర్శ న్‌, ఎస్‌.ఈశ్వరయ్య తదితరులు సమస్య ను ఆర్డీవోకు వివరించారు. 

ఓబులవారిపల్లె:తహసీల్దారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.  వివిధ శాఖల అధికారులతో కలసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేదల భూసమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రభుత్వంపై నమ్మకం కలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తమసీల్దారు పీర్‌మున్నీ, ఎంపీడీవో విజయరావు, హౌసింగ్‌ ఏఈ మురళీ, అగ్రికల్చర్‌ అధికారి శ్రీరాములు, బాల సుబ్రమ్మణ్యం, శ్రీనివాసులు, పశువైద్య అధికారి డాక్టర్‌ రవీంద్రవర్మ, ఐసీడీఎస్‌ అధికారులు, వైసీపీ నాయకులు నూకా పాపుగారి వెంకటసుబ్బారెడ్డి, సర్పంచ్‌ పాపిరెడ్డి, తల్లెం భరత్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T04:59:39+05:30 IST