గుమ్మడి పెరుగు పులుసు

ABN , First Publish Date - 2020-05-04T17:06:58+05:30 IST

బూడిద గుమ్మడి ముక్కలు - 100 గ్రా., నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి - తాలింపు కోసం, పసుపు - అర టీ స్పూను, ఉల్లి తరుగు - అరకప్పు, టమోటా తరుగు - అరకప్పు, పచ్చికొబ్బరి

గుమ్మడి పెరుగు పులుసు

కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడి ముక్కలు - 100 గ్రా., నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి - తాలింపు కోసం, పసుపు - అర టీ స్పూను, ఉల్లి తరుగు - అరకప్పు, టమోటా తరుగు - అరకప్పు, పచ్చికొబ్బరి - పావు కప్పు, పచ్చిమిర్చి - 2, అల్లం - అరంగుళం ముక్క, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - అరకప్పు. 

తయారుచేసే విధానం: నూనెలో ఉల్లి తరుగు 2 నిమిషాలు మగ్గించి గుమ్మడి ముక్కలు, ఒక కప్పు నీరు, పసుపు, చిటికెడు ఉప్పు వేసి మూతపెట్టి ఉడికించాలి. మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, చిటికెడు జీలకర్ర, పచ్చికొబ్బరి వేసి బరకగా రుబ్బుకోవాలి. ఆ మిశ్రమంతో పాటు టమోటా ముక్కలు, ఉప్పు వేయాలి. తర్వాత శనగపిండి వేసి ఉండలు లేకుండా కలిపిన పెరుగు కూడా వేసి చిన్నమంటపై పది నిమిషాలు ఉడికించి దించి, విడిగా పెట్టిన తిరగమోత కలపాలి. 

Updated Date - 2020-05-04T17:06:58+05:30 IST