Advertisement
Advertisement
Abn logo
Advertisement

పంప్‌హౌస్‌ మూత

నదిలో నీరున్నా నిర్లక్ష్యం


మంత్రాలయం మండలంలోని మాధవరం-రాంపురం గ్రామాల మధ్య నిర్మించిన గురురాఘవేంద్ర మాధవరం పంప్‌హౌస్‌ మూతపడింది. పైప్‌లైన్‌ లీకేజీ పనులు చేపట్టకపోవడంతో ఎత్తిపోతల పథకం నుంచి నీటి సరఫరాను నిలిపేశారు. నదిలో నీరున్నా బెళగల్‌ రిజర్వాయర్‌కు అందడం లేదు. 4,210 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. మాధవరం-రచ్చుమర్రి గ్రామల సరిహద్దుల్లో పైపులైన్‌కు లీకేజీలు ఏర్పడ్డాయి. మరమ్మతు పనులు తూతూమంత్రంగా చేపట్టారు. వారంలోపు పూర్తిచేయాల్సి ఉండగా, రెండు నెలలు గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రబీ పంటల సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతు చేసి, తుంగభద్ర నీటిని పంపింగ్‌ చేసి రిజర్వాయర్‌ను నింపాలని కోరుతున్నారు.


- మంత్రాలయం

Advertisement
Advertisement