Abn logo
Sep 18 2021 @ 00:54AM

పంప్‌హౌజ్‌ పరిశీలన

సారంగపూర్‌లోని పంప్‌హౌజ్‌ను పరిశీలిస్తున్న పెంటారెడ్డి

సారంగపూర్‌ పంప్‌హౌజ్‌ను పరిశీలించిన రాష్ట్ర ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి

నిజామాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సారంగపూర్‌లో నీటమునిగిన కాళేశ్వరం ప్యాకేజీ 20లోని సర్జ్‌పూల్‌, పంప్‌హౌజ్‌లను శుక్రవారం రాష్ట్ర ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి జిల్లా నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఉదయం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన సీఈ మధుసూదన్‌రావుతో కలిసి సారంగపూర్‌ పంప్‌హౌజ్‌కు వచ్చి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కన్‌స్ట్రక్షన్‌ కంపెనీల ఇంజనీర్లతో మాట్లాడారు. పంప్‌హౌజ్‌లలో సుమారు 30 మీటర్ల వరకు నీళ్లు చేరాయని అధికారులు ఆయనకు వివరించారు. నిర్మాణం ఉన్న సమయంలో నీళ్లు చేరడంతో పరిస్థితిని సమీక్షించడంతో పాటు మొదట నీళ్లు తోడేందుకు ఏర్పాట్లు చేయాలని పెంటారెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులతో పా టు కన్‌స్ట్రక్షన్‌ యాజమాన్యానికి సూచించారు. నీటిని తోడేందుకు మోటార్‌లను ఏర్పాటు చేసి త్వరగా మో టార్‌లను పైకి తీసుకురావాలన్నారు. మోటార్‌ల పరిస్థితిని పరిశీలించి తర్వాత మళ్లీ కిందికి దించాలని అ ధికారులకు సూచించారు. ప్రాజెక్టు సైట్‌లోని అన్ని ప్రాంతాలను పరిశీలించి నీళ్లు సొరంగమార్గంతో పా టు పక్కనే ఉన్న కాల్వ ద్వారా పంప్‌హౌజ్‌ ప్రాంతాని కి చేరినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సుమా రు 2 గంటల పాటు సారంగపూర్‌లోని సర్జ్‌పూల్‌, వ ద్ద ఉండి అన్నీ పరిశీలించిన తర్వాత నవీపేట మండలం బినోలాకు వెళ్లి హెడ్‌ రెగ్యులేటర్‌ను పరిశీలించా రు. ఆయన వెంట జిల్లా సాగునీటిశాఖ అధికారులతో పాటు ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

సాంకేతిక అంశాలపై దృష్టి

శుక్రవారం సారంగపూర్‌కు చేరుకున్న సలహాదా రు పెంటారెడ్డి సాంకేతిక అంశాల ఆధారంగా పరిశీల న చేపట్టారు. ఈ నెల 6, 7 తేదీల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఎస్సారెస్పీకి గోదావరి, మంజీరాల నుంచి వరద రావడంతో బ్యాక్‌వాటర్‌ పెరిగింది. హెడ్‌ రెగ్యులేటర్‌ కిలో మీటరున్నర ఉన్న దానిపైకి వరద వచ్చి సొరంగమార్గం ద్వారా పంప్‌హౌజ్‌ వద్దకు వరద చేరింది. ఈ సమయంలో నీరు చొచ్చుకురావడం, పనిచేసే సిబ్బంది గుర్తించకపోవడం, సుమారు ఒకరోజులో పే 30 మీటర్లకుపైగా నీళ్లు చేరడం వంటి అంశాలను ఆయన పరిశీలించారు. పనిచేసే సమయంలో నీళ్లు చేరుకుంటే అధికారులు గుర్తించలేదా అనే విషయాలను ఆయన పరిశీలించారు. నిర్మాణం ఏవిధంగా జరుగుతోంది.. సర్జ్‌పూల్‌ నుంచి పంప్‌హౌజ్‌కు వాటర్‌ ఏ విధంగా వస్తోంది తదతర విషయాలను సాంకేతిక అంశాల ఆధారంగా ఆయన పరిశీలించారు. ఇంజనీరి ంగ్‌ అధికారుల తనిఖీలు, ఇతర వివరాలను సమీక్ష లో అడిగినట్లు తెలుస్తోంది. అన్ని విషయాలను పరిశీలించిన ఆయన నీటిని తోడిన తర్వాతనే పూర్తి నివేదిక అందించాలని సీఈకి సూచించినట్టు తెలిసింది.

నెల రోజుల తర్వాతే పనులు

సారంగపూర్‌ సర్జ్‌పూల్‌లోకి నీళ్లు రావడం వల్ల పనులు నెల రోజులు మొదలవుతాయని రాష్ట్ర ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి తెలిపారు. నీళ్లు పూర్తిగా తీసిన తర్వాతనే ఎక్కడనుంచి వచ్చాయో అంచనా వేస్తామని అన్నారు. ప్రస్తుతం సర్జ్‌పూల్‌, పంప్‌హౌజ్‌లలో నీళ్లు ఉండడం వల్ల అంచనా వేయలేకపోతున్నామన్నారు. మొత్తం నీళ్లు తీసివేసేందుకే పది రో జుల సమయం పడుతుందన్నారు. ఆ తర్వాతనే సాంకేతిక అంశాలను పరిశీలిస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు నిర్మాణం ఉన్న ప్రాంతాల్లో జరగడం సహజమని ఆయన అన్నారు. పూర్తి నీటిని తొలగించిన తర్వాత ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించి నివేదిక ఇస్తారన్నారు. సాంకేతిక అంశాల ద్వారా లోపాలను పరిశీలించి సరిచేస్తామన్నారు. నిర్మాణం సమయంలో సొరంగంతో పాటు పక్కన ఉన్న కాల్వల ద్వారా వరద రావడంతోనే నీళ్లు చేరాయని ఆయన తెలిపారు.