పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్తుదే భవిష్యత్తు

ABN , First Publish Date - 2022-06-26T04:52:47+05:30 IST

బొగ్గు వినియోగం లేకుండా.. వాతావరణం కాలుష్యం కాకుండా.. కార్బన డై యాక్సైడ్‌ విడుదల లేని పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌దే భవిష్యత్తు అని గ్రీనకో గ్రూపు ఫౌండర్‌ సీఈవో ఎండీ అనిల్‌కుమార్‌ చలమలశెట్టి అన్నారు.

పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్తుదే భవిష్యత్తు
మాట్లాడుతున్న గ్రీనకో గ్రూపు ఫౌండర్‌ సీఈఓ. ఎండీ అనిల్‌కుమార్‌ చలమలసెట్టి

  1. గ్రీనకో గ్రూపు ఫౌండర్‌, సీఈవో ఎండీ అనిల్‌కుమార్‌ చలమలశెట్టి
  2. పిన్నాపురంలో ఫోరం ఆఫ్‌ రెగ్యులేటరీ (ఫర్‌) సమావేశం
  3. హాజరైన వివిధ రాష్ట్రాల ఎలకి్ట్రసిటీ రెగ్యులేటర్‌ చైర్మన్లు

కర్నూలు, జూన 25 (ఆంధ్రజ్యోతి)/ఓర్వకల్లు: బొగ్గు వినియోగం లేకుండా.. వాతావరణం కాలుష్యం కాకుండా.. కార్బన డై యాక్సైడ్‌ విడుదల లేని పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌దే భవిష్యత్తు అని గ్రీనకో గ్రూపు ఫౌండర్‌ సీఈవో ఎండీ అనిల్‌కుమార్‌ చలమలశెట్టి అన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటం తండా సమీపంలో 5,230 మెగా వాట్స్‌ సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ వపర్‌ ఉత్పత్తి లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక (రెన్యువబుల్‌) ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. దేశంలోనే ప్రప్రథమ ప్రాజెక్టు ఇది. ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాలో పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌పై దృష్టి సారించాయి. ఇలాంటి కీలకమైన ప్రాజెక్టుకు ఐదేళ్ల క్రితమే అప్పటి సీఎం చంద్రబాబు దూరదృష్టితో కరువు సీమ కర్నూలు జిల్లా వేదికగా శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమైంది. పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, విద్యుత్తు ఉత్పిత్తి వంటి అంశాలపై అధ్యాయనానికి పలు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఉత్సాహాం చూపుతోంది. సెంట్రల్‌ ఎలకి్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన (సీఈఆర్‌సీ) ఆధ్వర్యంలో ఫోరం ఆఫ్‌ రెగ్యులేటరీ (ఫర్‌) వర్కింగ్‌ గ్రూపు రాష్ట్రాల పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన, ఢిల్లీ, పంజాబ్‌, సిక్కిం, చత్తీస్‌ఘడ్‌, త్రిపుర, ఉత్తరప్రదేశ, ఆంధ్రప్రదేశ రాష్ట్రాల ఎలకి్ట్రసిటీ రెగ్యులేటర్‌ కమిషన చైర్మన్లు శనివారం ఓర్వకల్లు మండలం గుమ్మటంతండా దగ్గర గ్రీనకో సంస్థ చేపట్టిన పిన్నాపురం పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రాజెక్టు క్షేత్ర స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి సెంట్రల్‌ ఎలకి్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన (సీఈఆర్‌సీ) చీఫ్‌ కన్వీనర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా గ్రీనకో సంస్థ ఎండీ అనిల్‌కుమార్‌ చలమలశెట్టి మట్లాడుతూ రాబోయే రోజుల్లో పంప్డ్‌ స్టోరేజ్‌ వపర్‌దే భవిష్యత్తు అన్నారు. ఏటే బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నాయని, బొగ్గు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి వల్ల వాతావరణ కూడా కలుషితం అవుతుంది. వాతావరణానికి ఎలాంటి హానీ కలగని పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌పై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నట్లు ఆయన వివరించారు. పిన్నాపురం పీఎస్‌పీ ప్రాజెక్టు డిజైన మొదలుకొని నిర్మాణం, విద్యుత్తు ఉత్పత్తి, నిర్వహణ తదితర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన ద్వారా ఆయా రాష్ట్రాల ఈఆర్‌సీ చైర్మన్లకు వివరించారు. సుతీర్థ భట్టాచార్య మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో గ్రీనకో సంస్థ ప్రపంచంలోనే అతి పెద్ద సమగ్ర పునరుత్పాదక పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒక విజనతో సహకారం అందిస్తోందని ప్రశంసించారు. త్వరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని గ్రీనకో సంస్థకు సూచించారు. ఏపీ ఎలకి్ట్రసిటీ రెగ్యులేటరీ కమిషన చైర్మన జస్టిస్‌ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ పంప్డ్‌ స్టోరేజ్‌, పవన, సౌర విద్యుత్తు మూడు పిన్నాపురం వేదికగా ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. అధ్యయన సమగ్ర నివేదికను సీఈఆర్‌సీకి అందజేస్తారు. సమావేశంలో సెంట్రల్‌ ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన చైర్‌పర్సన హేమంతవర్మ, సీనియర్‌ అడ్వైజర్‌ రవీంద్ర, సుశాంత ఛటర్జీ, ఎలక్ర్టిసిటీ రెగ్యులేటరీ కమిషన పశ్చిమబెంగాల్‌ అడ్వైజర్‌ తపన చక్రవర్తి, త్రిపురం చైర్మన రాధాకృష్ణా, ఏపీ ఎస్‌పీసీఎల్‌వీసీ ఎండీ రమణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు, ఓర్వకల్లు తహసీల్దార్‌ శివరాముడు తదితరులు హాజరు అయ్యారు. 


Updated Date - 2022-06-26T04:52:47+05:30 IST