Abn logo
Jun 3 2020 @ 11:52AM

పుల్వామా కుట్ర కేసులో భద్రతా బలగాలకు భారీ విజయం

శ్రీనగర్: పుల్వామా కుట్ర కేసులో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. కారులో 45 కేజీల పేలుడు పదార్ధాలు పెట్టి భదత్రా దళాలను టార్గెట్ చేసిన మాస్టర్ మైండ్ వలీద్‌ను హతమార్చారు. పుల్వామా కంగన్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు చనిపోగా వారిలో వలీద్ కూడా ఉన్నాడు. వలీద్ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాది.


2019 ఫిబ్రవరి 14న 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నట్లు గానే ఇటీవల కూడా ఉగ్రవాదులు పుల్వామాలో భారీ పేలుడు పదార్ధాలతో కారులో వెళ్తుండగా భద్రతా బలగాలు వెంబడించాయి. కాల్పులు జరపడంతో ఉగ్రవాదులు కారు వదిలి పారిపోయారు. కారులో ఉన్న పేలుడు పదార్ధాలను సైన్యం నిర్మానుష్య ప్రదేశంలో పేల్చివేసింది. ఆ తర్వాత పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగించారు. ఎట్టకేలకూ మాస్టర్ మైండ్‌తో సహా మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చారు. గడచిన 24 గంటల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. గడచిన 5 నెలల్లో సైన్యం ఇప్పటివరకూ 75 మంది ఉగ్రవాదులను హతమార్చింది. 

Advertisement
Advertisement
Advertisement