Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ప్రసాదం పులిహోర

ప్రసాదం పులిహోర

కావలసిన పదార్థాలు: ఉడికించి చల్లార్చిన పొడి అన్నం - రెండు కప్పులు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు - ఒక్కో టీ స్పూను చొప్పున, వేగించిన వేరుశనగలు - గుప్పెడు, ఎండుమిర్చి - 2, చీరిన పచ్చిమిర్చి - 2, పసుపు - ఒక టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, ఉప్పు - రుచికి సరిపడా, బెల్లం - ఒక టీ స్పూను, చింతపండు గుజ్జు నీరు - ఒక కప్పు. పొడికోసం : ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, నువ్వులు - ఒక్కో టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి - 2. 


తయారుచేసే విధానం: కడాయిలో నూనె వేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు ఒకటి తర్వాత ఒకటి వేగించి చింతపండు నీరుపోయాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, బెల్లం వేసి మరిగించాలి. నూనె పైకి తేలిన తర్వాత వేగించి చేసుకున్న దినుసుల పొడి కలిపి రెండు నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు అన్నం వేసి బాగా కలిపి పైనుంచి రుచికోసం కొద్దిగా ఉప్పు చల్లి దించేసి సర్వ్‌ చేయాలి. 

పనస బిర్యానీపనస బిర్యానీమామిడికాయ పులిహోరమామిడికాయ పులిహోరవెజ్‌ కోఫ్తా బిర్యానీవెజ్‌ కోఫ్తా బిర్యానీవెజ్‌ తెహ్రీవెజ్‌ తెహ్రీకొత్తిమీర రైస్‌కొత్తిమీర రైస్‌పైనాపిల్‌ పులావ్‌పైనాపిల్‌ పులావ్‌Mexican ఫ్రైడ్‌ రైస్‌ Mexican ఫ్రైడ్‌ రైస్‌ నరంజ్‌ పులావునరంజ్‌ పులావుమటర్‌ పులావ్‌మటర్‌ పులావ్‌పన్నీర్ పులావ్ (వీడియో) పన్నీర్ పులావ్ (వీడియో)
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.