పులిచింతలకు జలకళ

ABN , First Publish Date - 2021-08-12T00:17:42+05:30 IST

పులిచింతల ప్రాజెక్టు మళ్లీ జలకళ సంతరించుకుంటుంది. ప్రాజెక్టులో నీటి మట్టం క్రమేణా పెరుగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న

పులిచింతలకు జలకళ

గుంటూరు: పులిచింతల ప్రాజెక్టు మళ్లీ జలకళ సంతరించుకుంటుంది. ప్రాజెక్టులో నీటి మట్టం క్రమేణా పెరుగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్టులో బుధవారం సాయంత్రానికి 26 టీఎంసీల నీరు చేరింది. 16వ గేటు విరిగిపోవడంతో నిండు కుండలా ఉన్న పులిచింతల రిజర్వాయర్ ఖాళీ అయ్యింది. 44 టీఎంసీలు ఉన్న నీరు ఐదు టీఎంసీలకు చేరుకోవడంతో పాటు వృధాగా సముద్రంలో కలిసిపోయింది. స్టాప్ లాకు గేటును ఏర్పాటు చేయడంతో పులిచింతలలో మళ్లీ నీటి నిల్వలు ప్రారంభమయ్యాయి. మరోవైపు పులిచింతల ప్రాజెక్టులో మిగతా గేట్ల పటిష్టతపై కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 16వ నెంబర్ గేటు స్థానంలో కొత్త స్టాపు లాక్ గేటు ఏర్పటు చేయడంతో ఆపటిష్టతను కూడా నిరంతరం పరిశీలిస్తున్నారు.

Updated Date - 2021-08-12T00:17:42+05:30 IST