పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి

ABN , First Publish Date - 2020-09-29T13:41:26+05:30 IST

భారీ వర్షాల కారణంగా పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది.

పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి

సూర్యాపేట: భారీ వర్షాల కారణంగా పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 6 గేట్లు 4 మీటర్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ 43.304 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 173.390 అడుగులుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ ఇన్ ప్లో : 2,60, 892 క్యూసెక్కులు, అవుట్ ప్లో : 1,93,240 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2020-09-29T13:41:26+05:30 IST