ఆచంట, నవంబరు 28: ఆచంట రామేశ్వరస్వామి ఆలయంలో ప్రతి కార్తీక పౌర్ణమి రోజున అఖండ ఖర్పూర జ్యోతిని వెలిగించడం ఆనవాయితీ ఆదివారం కార్తీక పౌర్ణమి కావడంతో అఖండ జ్యోతిని వెలిగించనున్నారు. ఈసందర్బంగా ఆల యం వద్ద మధ్యాహ్నం నుంచి కృత్తికా హోమం నిర్వహించి సాయంత్రం 6.30కు అఖండజ్యోతిని వెలిగిస్తారు. కరోనా సందర్భంగా కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమితిస్తామని ఆలయ ఈవో రామపెద్దింట్లురావు తెలిపారు.