హోమం నిర్వహిస్తున్న పండితులు
జంగారెడ్డిగూడెం, డిసెంబరు 2: గుర్వాయిగూడెం మద్ది ఆంజనే యస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ధన్వంతర జ యంతిని పురస్కరించుకుని అర్చ కులు, వేదపండితులు ధన్వంతరి హోమం, ఆయుష్ హోమం నిర్వ హించారు. ఆలయ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు కర్పూరం రవి పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కీసరి సరితా విజయ భాస్కరరెడ్డి, ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు.