ముగిసిన హనుమజ్జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-05-27T05:41:30+05:30 IST

నందమూరుగరువు భక్తాంజనేయస్వామి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలు గురువారం ముగిశాయి.

ముగిసిన హనుమజ్జయంతి వేడుకలు
యాగశాలలో భక్తాంజనేయుడు

వీరవాసరం, మే 26: నందమూరుగరువు భక్తాంజనేయస్వామి ఆలయంలో నుమజ్జయంతి వేడుకలు గురువారం ముగిశాయి. మూడురోజులపా టు స్వామి వారికి వివిద పూజా కార్యక్రమాలను నిర్వహించారు. గురువారం యాగశాలల్లో హనుమత్‌యాగం నిర్వహించారు. సంకల్పం, విశ్వక్సేన పూజా, పుణ్యహవచనం, మహాశాంతియాగం, మహా పూర్ణాహుతి పూజలు అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. గ్రామంలో భక్తాంజనేయస్వామి సేవా కమిటి సభ్యులు శోభాయాత్ర చేశారు.


పాలకొల్లు అర్బన్‌: హనుమజ్జయంతి పురస్కరించుకుని పట్టణం లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో రెండో రోజు గురువారం ప్రత్యేక పూజ లు నిర్వహించారు. యడ్ల బజారులోని పంచముఖాం జనేయ ఆలయంలో భక్తు ల గోత్రనామాలతో సహస్ర నామార్చనలు, విశేష పూ జలు అర్చకులు రమణ గురుస్వామి, ఎస్‌టీపీ రఘుబాబు పూజలు నిర్వ హించారు. అనంతరం భక్తులకు స్వామివారి జెండా, నరఘోష యంత్రం, వాహన రిబ్బన్‌, ప్రసాదం అందజేశారు. 

Updated Date - 2022-05-27T05:41:30+05:30 IST