పుదుచ్చేరిలోనూ స్కూల్ విద్యార్థినులు హిజాబ్ ధరించడానికి అనుమతి నిరాకరణ

ABN , First Publish Date - 2022-02-09T15:16:21+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో రాజుకున్న హిజాబ్ వివాదం పుదుచ్చేరికి విస్తరించింది.పుదుచ్చేరి పాఠశాలలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడానికి అనుమతి నిరాకరించింది....

పుదుచ్చేరిలోనూ స్కూల్ విద్యార్థినులు హిజాబ్ ధరించడానికి అనుమతి నిరాకరణ

పుదుచ్చేరి : కర్ణాటక రాష్ట్రంలో రాజుకున్న హిజాబ్ వివాదం పుదుచ్చేరికి విస్తరించింది.పుదుచ్చేరి పాఠశాలలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడానికి అనుమతి నిరాకరించారు. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడానికి అనుమతించక పోవడంతో పలువురు కార్యకర్తలు ప్రభుత్వ పాఠశాల ముందు గుమిగూడి నిరసన తెలిపారు.పుదుచ్చేరి ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ హిజాబ్  విషయంపై విచారణ జరపాలని అరియాంకుప్పం ప్రభుత్వ పాఠశాల హెడ్‌ని కోరింది.మరో వైపు కర్ణాటక హైకోర్టు హిజాబ్ వివాదంపై దాఖలైన పిటిషనుపై బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనుంది. హిజాబ్ వివాదం నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలని హైకోర్టు విజ్ఞప్తి చేసింది.


‘‘ఈ న్యాయస్థానానికి ప్రజల ధర్మంపై పూర్తి విశ్వాసం ఉంది.అదే ప్రజలు కూడా ఆచరణలో పెడతామని ఆశిస్తున్నాం’’ అని జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ అన్నారు. హిజాబ్ ధరించిన అమ్మాయిలను కాలేజీకి రాకుండా  చేయడమంటే మతాన్ని ఆచరించే హక్కును ఉల్లంఘించడమేనని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ వాదించారు.


Updated Date - 2022-02-09T15:16:21+05:30 IST