పుదీనా పరోటా

ABN , First Publish Date - 2021-10-23T05:30:00+05:30 IST

గోధుమపిండి - మూడు కప్పులు, పుదీనా - అరకప్పు, పసుపు - పావు టీస్పూన్‌, కశ్మీరీ కారం - అర టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌....

పుదీనా పరోటా

కావలసినవి

గోధుమపిండి - మూడు కప్పులు, పుదీనా - అరకప్పు, పసుపు - పావు టీస్పూన్‌, కశ్మీరీ కారం - అర టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - పావు టీస్పూన్‌, గరంమసాల - పావు టీస్పూన్‌, అల్లం పేస్టు - ఒక టీస్పూన్‌, చాట్‌ మసాల - అర టీస్పూన్‌, మిరియాలు - పావు టీస్పూన్‌, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత.


తయారీ విధానం

ఒక బౌల్‌లో రెండు కప్పుల గోధుమపిండి తీసుకుని అందులో పుదీనా, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, గరంమసాల, అల్లం పేస్టు, చాట్‌మసాల, దంచిన మిరియాలు, తగినంత ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు పోసి  కలుపుకోవాలి. 

 ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుని చపాతీలా చేయాలి. పొడి పిండి అద్దుకుంటూ, రోల్‌ చేసుకుంటూ పరోటాలు తయారుచేసుకోవాలి. చేత్తో కూడా ఒత్తుకోవచ్చు. 

 తరువాత స్టవ్‌పై పెనం పెట్టి నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. ఏదైనా కర్రీతో వేడి వేడి పరోటాలు సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-10-23T05:30:00+05:30 IST