ప్రజా ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య

ABN , First Publish Date - 2022-05-20T07:18:54+05:30 IST

ప్రజా ఉద్యమనేత పుచ్చలపల్లి సుందరయ్య అని ఏ.బాదుల్లా అన్నారు. ప్రొగ్రసివ్‌ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ప్రజా ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య
సుందరయ్య చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నేతలు

పొదిలి రూరల్‌ మే 19 : ప్రజా ఉద్యమనేత పుచ్చలపల్లి సుందరయ్య అని ఏ.బాదుల్లా అన్నారు. ప్రొగ్రసివ్‌ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుందరయ్య  వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ ఉన్నత కుటుంబం లో జన్మించి సమాజంలో ఆర్ధిక అసమానతలు రూపుమాపేందుకు కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారన్నారు. ఆయన  ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఆయన అడుగుజాడల్లో నడిచార న్నారు. ఆయన నిస్వార్ధంగా  ప్రజాసేవ చేసిన మహానీయుడు సుందరయ్య అన్నారు. కార్యక్రమంలో యూటీయఫ్‌ జిల్లా కార్యదర్శి షేక్‌ అబ్ధుల్‌హై, సీఐటీయూ పశ్చిమ ప్రకాశం కార్యదర్శి ఎం.రమేష్‌, జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు గురుస్వామి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 

త్రిపురాంతకం : కమ్యూనిస్టు ఉద్యమ  నేత పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతిని ఎన్నెస్పీ కాలనీలోని సీఐటీయూ కార్యాలయం వద్ద గురువారం ఘనంగా నిర్వహించారు. సుందరయ్య చిత్ర పటానికి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం సీనియర్‌ నాయకుడు వైటీ ఆంజనేయులు మాట్లాడుతూ.. పేద ప్రజల కోసం నిరంతరం పోరాడిన మహోన్నత వ్యక్తి  సుందరయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో ఎనిబెర లాబాను, సుశీల, జ్యోతి, శారమ్మ, ఈశ్వరరెడ్డి, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌) : దేశంలోని రైతు లు, కార్మికులు, కూలీల సమస్యలపై తుదిశ్వాస విడిచే వరకు అహర్నిశలు కృషి చేసిన ఆదర్శనీ యుడు పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం నాయకులు సోమయ్య అన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు  రఫి రూబెన్‌, వెంకటేశ్వర్లు, జి.రాజు, విక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T07:18:54+05:30 IST