సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి

ABN , First Publish Date - 2021-10-19T05:52:16+05:30 IST

సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రవి అన్నారు.

సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి
దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌

జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 18 : సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో సోమ వారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి 19 మంది తమ సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రాలు అంద జేశారు. ప్రతి ధరఖాస్తును తక్షణమే పరిష్కరించాలని అధికారులకు జిల్లా కలెక్టర్‌ రవి ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ ఉన్నారు.

Updated Date - 2021-10-19T05:52:16+05:30 IST