బుద్ద నాగజగదీశ్వరరావు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద
అనకాపల్లి అర్బన్, మే 14: మోయలేని పన్నుల భారం వేసి ప్రజలకు పీక్కుతింటున్న రాబందులా సీఎం జగన్‌రెడ్డి తయారయ్యారని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. శనివారం స్థానిక విలేఖరులతో ఆయన మాట్లాడారు. గడగడపకూ వైసీపీ కార్యక్రమంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రజాగ్రహంతో వైసీపీ నాయకులు కక్కలేక, మింగలేక ఉన్నారన్నారు. పథకాల అమలుకు అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. జగన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ కూడా మరో శ్రీలంకలా తయారు కాబోతుందన్నారు. పఽథకాల్లో కోతలు విధించి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అతని వెంట పార్టీ అధికార ప్రతినిధి కడిమిశెట్టి నరసింగరావు, అనకాపల్లి పార్లమెంటు ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ బాబర్ ఉన్నారు.