రైతు వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజా పోరాటం

ABN , First Publish Date - 2020-09-22T08:30:01+05:30 IST

రైతన్నలను వీధి పాల్జేసే చర్యలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ, లౌకికవాద పార్టీలు ప్రజా పోరాటానికి ముందుకు రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతులకు నష్టం కలిగించే

రైతు వ్యతిరేక ప్రభుత్వంపై ప్రజా పోరాటం

రైతన్నలను వీధి పాల్జేసే చర్యలకు పాల్పడుతున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రాంతీయ, లౌకికవాద పార్టీలు ప్రజా పోరాటానికి ముందుకు రావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లో సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ బిల్లుల ప్రతులను చాడ తగులబెట్టారు. కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా ఉన్న ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేక చర్యలపై తాము ేసవ్‌ ఇండియా, ేసవ్‌ డెమాక్రసీ, ేసవ్‌ నేషన్‌, ేసవ్‌ సెక్యులర్‌ నినాదాలతో ఉద్యమిస్తామన్నారు. నాయకులు ఈటీ నర్సింహ, వీఎస్‌ బోస్‌, బి.వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు. కాగా, తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు ప్రగతి భవన్‌కు వెళ్లిన గొర్రెలు, మేకల పెంపకందారులను అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. తక్షణం వారిని విడుదల చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-09-22T08:30:01+05:30 IST