జలదోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం

ABN , First Publish Date - 2020-05-21T09:27:55+05:30 IST

ఏపీ చేపడుతున్న జల దోపిడీకి వ్యతిరేకంగా జూన్‌ 2 నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చే స్తామని మాజీ మంత్రి నాగం

జలదోపిడీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం

టీఆర్‌ఎస్‌ నేతల తీరుపై మండిపడిన నాగం జనార్దన్‌రెడ్డి 


నాగర్‌కర్నూల్‌, మే 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ చేపడుతున్న జల దోపిడీకి వ్యతిరేకంగా జూన్‌ 2 నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు  చే స్తామని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వెల్ల డించారు. జిల్లాకేంద్రంలోని తన నివాసగృహంలో బుధవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో నాగం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పో తిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా జిల్లా ప్రజానీకానికి జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకోవడం మానేసిన టీఆర్‌ఎస్‌ నేతలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. 


సీఎం కేసీఆర్‌తో సహా టీఆర్‌ఎస్‌ నేతలందరూ మాయ మాటలతో ప్రజలను వంచిస్తున్నారని విమర్శ నాస్త్రాలు ఎక్కుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టుల కింద ఆయకట్టును స్థిరీకరించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకు వే యలేదన్నారు.  పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెం చడాన్ని నిరసిస్తూ జూన్‌ 2న జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు అతినారపు రాములు, బాలగౌడ్‌, కౌన్సిలర్‌ నిజామ్‌, అర్జున య్య, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-21T09:27:55+05:30 IST