ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-06-18T06:19:19+05:30 IST

ప్రజాసమస్యలను సత్వరమే పరిష్క రించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
అర్జీలను స్వీకరిస్తున్న ఎమెల్యే

- ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

ధర్మవరంఅర్బన, జూన 17: ప్రజాసమస్యలను సత్వరమే పరిష్క రించాలని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అధికారులను ఆదేశించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుంచి పిర్యాదులను స్వీకరించారు. మొత్తం 419 ఫిర్యాదులో రాగా అందులో 163 పింఛనలు, హౌసింగ్‌ 136, రెవిన్యూసమస్యలు 25, మున్సిపాలిటీ పరిధిలో 20, ఇతర సమస్యలు 75 వచ్చాయి. సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... వార్డు ప్రజలకు కౌన్సిలర్లు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరించాలన్నారు. సచివాలయాలను వారానికో పది రోజుల కోకసారి సందర్శించి గ్రీవెన్సలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిలో ఎన్నింటికి పరిష్కారం  చేసారో తెలుసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా అర్హులకు పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవా లన్నారు. మున్సిపాలిటీ పరిధిలోపట్టాలు పొందిన లబ్ధిదారులందరూ త్వరగా ఇళ్ల నిర్మాణం చేపట్టేవిధంగా చైతన్య పరచాలన్నారు.ఏ సంక్షేమపథకం అందలేదని ప్రజలు నిరుత్సాహానికిలోను కాకూడద న్నారు. పథకాలు అందనివారు తిరిగి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన లింగం నిర్మల, వైస్‌చైర్మన చందమూరినారాయణరెడ్డి, కమిషనర్‌ మల్లికార్జున, ఆర్వోఆనంద్‌కుమార్‌, ఆర్‌ఐ రవి, మున్సిపల్‌ మేనేజర్‌ అశ్వర్థనారాయణ, కౌన్సిలర్‌లు షంషాద్‌బేగం, రాయపాటిమంజుల, అత్తర్‌జిలాన, కోటిరెడ్డి సుజాత, సాయికుమార్‌, మేడాపురం వెంకటేశ, జేసీబీరమణ, శంకర తేజేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-18T06:19:19+05:30 IST