Advertisement
Advertisement
Abn logo
Advertisement

మండలంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి

తిరుమలగిరి, నవంబరు 26: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వ యంతో పని చేసి మండలంలోని ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంపీపీ నెమురుగొమ్ముల స్నేహలత అన్నారు.  తిరుమలగిరి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావే శంలో ఆమె మాట్లాడారు. గ్రామాల్లో మంచినీరు, విద్యుత్‌ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రాఘవాపురం సర్పంచ్‌ మహేష్‌ మాట్లాడుతూ తమ పంచాయతీకి నెలకు వేలల్లో కరెంట్‌ బిల్లు వస్తోం దని, అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. అప్పులు చేసి కరెంట్‌ బిల్లులు చెల్లిస్తున్నా మని తెలిపారు. మండలంలో విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని ఆ శాఖ ఆధికారులను ఎంపీపీ ఆదేశించారు. మండలంలో కరోనా వ్యాక్సినే షన్‌  నూరు శాతం పూర్తయ్యేందుకు  వైద్య సిబ్బందికి అధికారులు సహక రించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ మూల అశోక్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాలెపు చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ సంతోష్‌ కిరణ్‌, ఎంపీడీవో కె.ఉమేష్‌చారి, ఎంపీవో మారయ్య, ఎంఈవో శాంతయ్య, ఏవో వెంకటేశ్వర్లు  డాక్టర్‌ ప్రశాంత్‌బాబు పాల్గొన్నారు. Advertisement
Advertisement