ప్రజల ఆరోగ్యమే పరమావధి

ABN , First Publish Date - 2021-04-21T05:47:23+05:30 IST

రామగుండంలో ప్రజల ఆరోగ్యమే పరమావధిగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రామగుండంలో కరోనా నియంత్రణకు చర్య లు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యమే పరమావధి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌

- యుద్ధ ప్రాతిపదికన డిజిన్ఫెక్షన్‌ ప్రక్రియ  

- ఎమ్మెల్యే చందర్‌

గోదావరిఖని, ఏప్రిల్‌ 20: రామగుండంలో ప్రజల ఆరోగ్యమే పరమావధిగా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రామగుండంలో కరోనా నియంత్రణకు చర్య లు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌, కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహంచారు. కరోనా ని యంత్రణకు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల మరణాలు సంభవించకుండా అప్రమత్తతో వ్యవహరిస్తున్నామని, ప్రజలు కూడా స్వీయ నియంత్రే శ్రీరామరక్ష సూత్రాన్ని పాటించాలన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాక్సినేషన్‌ కోసం పిలుపునిచ్చారని, గోదావరిఖని ప్రభుత్వాసుపత్రితో పాటు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు రామగుండంలో పారిశుధ్యంపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. అన్నీ నాలాల్లో పూడికతీయడం, నీరు నిల్వఉన్న ప్రాంతాల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయడం, దోమలు, ఈగలు వ్యాప్తిచేయకుండా ఆయిల్‌బాల్స్‌ వేయడం, ఫా గింగ్‌ చేస్తున్నామన్నారు. కొవిడ్‌ కేసులు ఉన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన డిజిన్ఫెక్షన్‌ చర్యలు చేపట్టామని, 12 స్ర్పే ట్రాక్టర్లను సిద్ధం చేశామన్నారు. పారిశుధ్య వ్యవస్థ పటిష్ఠపర్చడానికి అధునాతన యంత్రాలతో కూడిన వాహనాలను, ఆటో ట్రాలీలను ప్రవేశపెట్టామన్నారు. కొవిడ్‌ నివారణ చర్యలకు నిధుల కొరత లేకుండా పట్టణ ప్రణాళిక నిధులను వినియోగించి అవసరమైన సామాగ్రిని అత్యవసరంగా తెప్పించామన్నారు. నగరపాలక సంస్థలో 25 టన్నుల చున్నం, 500బ్యాగుల బ్లీచింగ్‌ పౌడర్‌, 10వేల లీటర్ల సోడియం హైపోక్లోరైడ్‌, 500 లీటర్ల శానిటైజర్‌, 10వేల మాస్క్‌లు, 3వేల గ్లౌజులు, 500 పీపీఈ కిట్లను అందుబాటులో ఉంచామన్నారు. రామగుండంలో కొవిడ్‌ మరణాలు సంభవించకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నామని, కరోనాతో మృత్యువాత పడినవారికి అంత్యక్రియలు నిర్వహించడానికి తగు ఏర్పాటు చేశామని, రెండు వైకుంఠ రథాలను అందుబాటులో ఉంచామన్నారు. ప్రజలు కూడా కరోనా పట్ల అప్రమత్తతో ఉండాలని, ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే కార్పొరేషన్‌ హెల్ప్‌లైన్‌ నెం.9392483959ను సంప్రదించాలని ఎమ్మెల్యే చందర్‌ కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డిప్యూ టీ మేయర్‌ అభిషేక్‌రావు, కార్పొరేషన్‌ అధికారులు, కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యు లు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T05:47:23+05:30 IST