ప్రమాదంలో ప్రజారోగ్యం

ABN , First Publish Date - 2021-06-17T03:40:09+05:30 IST

: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆరోపించారు

ప్రమాదంలో ప్రజారోగ్యం
తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ

కరోనా మృతులకు పరిహారం చెల్లించాలి

వ్యవసాయ ఉత్పతులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి 

మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల డిమాండ్‌

వెంకటగిరి, జూన్‌ 16: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆరోపించారు. బుదవారం స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేక పోవడంతో వేలాది మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 65 లక్షల డోసులు వ్యాక్సిన్‌ ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం 26 లక్షల డోసులు మాత్రం వినియోగించడంతో మిగిలినవి వృథా అయ్యాయన్నారు. కనీసం ఫ్రంట్‌ వారియర్స్‌కు సైతం రెండు డోసుల వ్యాక్సినేషన్‌ చేయించలేదంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కరోనా మృతుల అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 15వేల  నేటికీ ఎవరికీ అందలేదని ఆరోపించారు. రాష్ట్రంలో కరోనా విపత్తుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. కరోనా మృతులకు రూ.10లక్షలు, బ్లాక్‌ ఫంగస్‌ మృతులకు రూ 20 లక్షలు, ఆక్సిజన్‌ మృతులకు 25 లక్షలు, ఉపాధి కోల్పోయిన వారికి రూ.10 వేలు పరిహారంతోపాటు, ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా తహసీల్దారు ఆదిశేషయ్యకు వినతిపత్రం అందజేశారు.

 ఆనందయ్య మందు అందించాలి

 వైసీపీ నేతల రాజకీయంతో ఆనందయ్య పేరుతో నకిలీ మందులు వస్తున్నాయని ఆరోపించారు. దీంతో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో నాయకులు పులికొల్లు రాజేశ్వరరావు, కేవీకే ప్రసాద్‌ నాయుడు, శ్రీరామ దాసుగంగాధర్‌, చలపతి, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T03:40:09+05:30 IST