అంబులెన్స్‌ కొనుగోళ్లలో ప్రజాధనం దోపిడీ

ABN , First Publish Date - 2020-07-02T10:41:25+05:30 IST

108, 104 అంబులెన్స్‌ల కొనుగోళ్ళలో రూ.300 కోట్ల ప్రజా ధనం వైసీసీ దోచుకుందని తెలుగుదేశం పార్టీ నా యకులు విమర్శించారు.

అంబులెన్స్‌ కొనుగోళ్లలో ప్రజాధనం దోపిడీ

ఒంగోలు (కార్పొరేషన్‌) జూలై 1 : 108, 104 అంబులెన్స్‌ల కొనుగోళ్ళలో రూ.300 కోట్ల ప్రజా ధనం వైసీసీ దోచుకుందని తెలుగుదేశం పార్టీ నా యకులు విమర్శించారు. బుధవారం ఒంగోలులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వి లేఖరుల సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి డా క్టర్‌ జి.రాజ్‌విమల్‌, నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వ రరావు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 2011 అక్టోబర్‌ 1 నుంచి 2016 సెప్టెంబరు 30వ తేదీ వర కు జీవీకేఈఎంఆర్‌ సంస్థ అంబులెన్స్‌లను ని ర్వహించే ఒప్పందం కుదుర్చుకుందన్నారు.


టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒప్పం దంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని, తర్వాత టెం డర్లు పిలవగా జీవీకే సంస్థ దక్కించుకోగా, నిర్వ హణ బాధ్యతలు ఈ ఏడాది డిసెంబరు 12వ తేదీ వరకు ఉన్నాయని తెలిపారు. ఇంకా గడువు ఉండ గానే ప్రభుత్వం జీవో నెం. 116ను తీసుకొచ్చి అర బిందో సంస్థకు నిర్వహణ బాధ్యతలను కట్టబెట్టి ప్ర జాధనం దోచుకున్నారని ఆరోపించారు.


తెలుగు మహిళ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ల వెంకట రత్నం మాట్లాడుతూ నెల్లూరులో దివ్యాంగురాలైన మహిళా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిపై దాడి, వైసీపీ దౌ ర్జన్యాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. నింది తుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-07-02T10:41:25+05:30 IST