నేటినుంచి ప్లస్‌ వన్‌ Public‌ Examinations

ABN , First Publish Date - 2022-05-10T16:36:49+05:30 IST

రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో ప్లస్‌ వన్‌ పబ్లిక్‌ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షలు

నేటినుంచి ప్లస్‌ వన్‌ Public‌ Examinations

చెన్నై/పెరంబూర్‌: రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో ప్లస్‌ వన్‌ పబ్లిక్‌ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 5, టెన్త్‌ పరీక్షలు 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ప్లస్‌ వన్‌ పరీక్షలకు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 7,534 పాఠశాలలకు చెందిన 8.85 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 5,873 మంది ప్రైవేటు అభ్యర్థులు, 5,299 మంది దివ్యాంగులు, 99 మంది ఖైదీలు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం పుదుచ్చేరి 38 సహా 3,119 పరీక్షా కేంద్రాలు, ప్రైవేటు అభ్యర్థులకు  115, ఖైదీలకు 9 ప్రత్యేక పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌ సహా ఎలకా్ట్రనిక్‌ పరికారాలు అనుమతించరు.  విద్యార్థులు పాదరక్షలు, షూ, సాక్స్‌, బెల్ట్‌ ధరించడంపైనా నిషేధం విధించారు. పరీక్షల గురించిన సందేహాలు, సూచనలకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఉదయం 8 నుంచి  రాత్రి 8 గంటల వరకు 9498383081, 9398 383075 అనే నెంబర్లను సంప్రదించాలని పరీక్ష శాఖ తెలిపింది. పరీక్షలు ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి. జూలై 7న పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి.

Read more