ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-05-17T04:35:27+05:30 IST

ప్రజావాణికి వచ్చే ఫిర్యా దులను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిష్క రించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
కలెక్టర్‌కు సమస్యను వివరిస్తున్న మాజీ మంత్రి చిన్నారెడ్డి

వనపర్తి అర్బన్‌, మే16: ప్రజావాణికి వచ్చే ఫిర్యా దులను ఆయా శాఖల అధికారులు తక్షణమే పరిష్క రించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సోమవారం కలెక్ట రేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 35 ిఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. రేవల్లి మండలం బండరావిపాకుల గ్రామానికి చెందిన భూ నిర్వాసితు ల సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి చిన్నా రెడ్డి ప్రజావాణిలో కలెక్టర్‌కి వినతిపత్రం అందజే శారు. పాలమూరు రంగారెడ్డి ఏదుల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో భాగంగా బండరావిపాకుల గ్రామం ముంపునకు గురై ఏడు సంవత్సరాలు పూర్తయినా ఇంకా పూర్తిస్థాయిలో నష్టపరిహారం అంద లేదని తెలిపారు. అదే విధంగా వనపర్తి మండలం అంజన గిరి గ్రామానికి చెందిన దాదాపు 90మంది రైతులు సర్వే నంబర్‌ 6, 17లో 300 ఎకరాల భూమిని 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారని, ఇప్పుడు ఉన్నట్టుండి అటవీశాఖ అధికారులు భూములు తీసుకుంటున్నారని వినతిలో పేర్కొన్నట్లు వారు తెలిపారు.  కార్యక్రమంలో  అదనపు కలెక్టర్‌లు వేణు గోపాల్‌, లోకల్‌ బాడీ ఆశిష్‌ సంగ్వాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఎస్పీ కార్యాలయంలో..

వనపర్తి క్రైం : జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావా ణి కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు వచ్చిఐదు ఫిర్యాదులు అందజేశారు.   అదనపు ఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత  అధికారులు ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. 

 

Updated Date - 2022-05-17T04:35:27+05:30 IST